బాధ్యతలు స్వీకరించిన రావెల కిశోర్‌బాబు | ravela kishorbabu joins his duty | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన రావెల కిశోర్‌బాబు

Sep 1 2016 11:38 PM | Updated on Sep 4 2017 11:52 AM

తాత్కాలిక జిల్లా ఉప వైద్యాధికారిగా ఉన్న రావెల కిశోర్‌బాబుకు లెప్రసీ అండ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ విభాగపు అధిపతిగా బాధత్యలను అప్పగిస్తూ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం సిటీ : తాత్కాలిక జిల్లా ఉప వైద్యాధికారిగా ఉన్న రావెల కిశోర్‌బాబుకు లెప్రసీ అండ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ విభాగపు అధిపతిగా బాధత్యలను అప్పగిస్తూ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. లెప్రసీ అండ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ అదనపు జిల్లా వైద్యాధికారి సాయి ప్రతాప్‌ బుధవారం పదవీ విమరణ చేసిన విషయం తెలిసిందే.

ఆయన స్థానంలో టీబీ కంట్రోల్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రావెల కిశోర్‌బాబు తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనమాట్లాడుతూ ఈ విభాగంలో తనకు చాలా అనుభవం ఉందన్నారు. సమన్వయంతో ఎయిడ్స్‌ నియంత్రకు తమ వంతు కషి చేస్తామన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement