
కానిస్టేబుళ్ల సెలక్షన్లలో అపశ్రుతి
పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షల్లో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది.
నల్గొండ: పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షల్లో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. కానిస్టేబుళ్ల సెలక్షన్స్లో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో రాజశేఖర్ అనే యువకుడు కళ్లు తిరిగి కింద పడ్డాడు. సహాచరులు వెంటనే స్పందించి... అతడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... మరణించాడు. రాజశేఖర్ పెన్పహడ్ మండలం ముకుందాపురానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. రాజశేఖర్ మరణవార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.