వానొచ్చే.. పొలం మురిసే | Rain fall harvest | Sakshi
Sakshi News home page

వానొచ్చే.. పొలం మురిసే

Jul 27 2016 6:28 PM | Updated on Jun 4 2019 5:04 PM

వానొచ్చే.. పొలం మురిసే - Sakshi

వానొచ్చే.. పొలం మురిసే

రెండు రోజులుగా కురుస్తున్న వానలకు పల్లె చెరువులకు జలకళ వచ్చింది.. ..వాడిపోతున్న మొక్కజొన్నకు ఊపిరొచ్చింది.

ఊపందుకున్న వరినాట్లు
జగదేవ్‌పూర్‌:
రెండు రోజులుగా కురుస్తున్న వానలకు పల్లె చెరువులకు జలకళ వచ్చింది.. ..వాడిపోతున్న మొక్కజొన్నకు ఊపిరొచ్చింది..వరి, పత్తికి ప్రాణవాయువు అందినట్లయ్యింది...చెరువులు, కుంటలు క్రమంగా నిండుతున్నాయి..రైతుల సాగుపనుల్లో బిజీగా ఉన్నారు.

జగదేవ్‌పూర్‌ మండలంలోని ఎక్కువ శాతం వ్యవసాయమే జీవనాధారం. ఈ ప్రాంతంలో ఎక్కువగా నల్లరేగడి, ఎర్ర నెలలు ఉండడంతో పత్తి, మొక్కజొన్న పంటలు ప్రధానంగా సాగు చేస్తారు. మండలంలో గతేడాది కంటే ఈ సారి మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం ఖరీఫ్‌లో 9,200 హెక్టార్లు, పత్తి 4,100 హెక్టార్లు, వరి 700 హెక్టార్లు, కంది 600 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయఅధికారులు తెలిపారు. అయితే ఖరీఫ్‌ సీజన్‌లో అంతంగా వర్షాలు కురవకపొవడంతో సాగు అంతంత మాత్రంగానే కొనసాగింది

. మృగశిరలో భారీ వర్షం కురువడంతో రైతులు పంటల సాగు పనులు ప్రారంభించారు. అనంతరం ఆరుద్ర, పెద్దపూసాల కార్తెలో వానలు అంతంగా లేకుండాపోయాయి. దీంతో వేసిన పంటలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. చాలా గ్రామాల్లో మొక్కజొన్న పంట తాళ్లు పేనుకపోయో దశకు చేరింది. ఆయకట్టు రైతులు దుక్కులు దున్ని చినుకు కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నా క్రమంలో వరుణుడు కరుణించాడు. గత మూడు రోజలుగా వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో వరి నాట్లు ఉపందుకున్నాయి. సోమ, మంగళవారాల్లో భారీ వర్షం రావడంతో గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయి.  మండలంలోని 186 కుంటలున్నాయి. వీటిలో సగం వరకు నీటితో నిండుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement