
ఏ ముఖం పెట్టుకొని.!
చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ గిరిజనులు మండిపడుతున్నారు.
బాక్సైట్ గునపం
వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చింతపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి గిరిజనులకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో వణుకుపుట్టించారు. మావోయిస్టులు సైతం బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో 97 జీవోను తాత్కాలికంగా అనిశ్చితిలో ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రద్దు చేయలేదు. పూర్తిగా రద్దు చేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమేనని గిరిజనులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇటీవల మన్యంలో పర్యటించిన గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు మరోసారి ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేశారు. బాక్సైట్ తవ్వి తీరుతామని ఆయన చేసిన ప్రకటన గిరిజనుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో తమకు ఇంత అన్యాయం చేస్తూ తమ ఉనికినే లేకుండా చేయాలని చూస్తున్న చంద్రబాబు తమ వద్దకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ గిరిజనులు మండిపడుతున్నారు.