పుష్కర భక్తుల కోసం కర్నూలులో పుష్కరనగర్‌లు సిద్ధం అయ్యాయి. భక్తులు ప్రధానంగా వేచి ఉండే కొత్త బస్టాండు, రాజ్ విహార్ సెంటర్( అంబేద్కర్ భవన్ ఎదుట), నంద్యాల చెక్‌పోస్టులో వీటిని ఏర్పాటు చేశారు.
పుష్కరనగర్‌లు సిద్ధం
Aug 11 2016 10:44 PM | Updated on Sep 4 2017 8:52 AM
కర్నూలు(అగ్రికల్చర్): పుష్కర భక్తుల కోసం కర్నూలులో పుష్కరనగర్‌లు సిద్ధం అయ్యాయి. భక్తులు ప్రధానంగా వేచి ఉండే కొత్త బస్టాండు, రాజ్ విహార్ సెంటర్( అంబేద్కర్ భవన్ ఎదుట), నంద్యాల చెక్‌పోస్టులో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి పుష్కరనగర్‌లో ఒక డాక్టర్, పారా సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. భక్తులను అలరించేందుకు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. స్రీలు, పురుషులకు వేరువేరుగా టాయ్‌లెట్స్ వసతి కల్పించారు. ఒక్కో పుష్కరనగర్‌లో పురుషులకు 100, స్త్రీలకు 100 టాయ్‌లెట్స్ వసతి ఉంటుందని అధికార యంత్రాంగం ప్రకటించింది. భక్తులకు తాగు నీరు, స్నాక్స్ లభిస్తాయి. స్నాక్స్ కొనుగోలుపై ఇస్తారు. పుష్కరనగర్‌లకు ఏరియా ఆఫీసర్లు, ఆయన కింద ప్లేస్ ఆఫీసర్లు ఉంటారు.
Advertisement
Advertisement