ఆధారాల సేకరణ పూర్తి | pushkar ghatana investigation | Sakshi
Sakshi News home page

ఆధారాల సేకరణ పూర్తి

Jan 28 2017 11:37 PM | Updated on Sep 5 2017 2:21 AM

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న విచారణలో ఆధారాల సేకరణ పూర్తయిందని ఏకసభ్య కమిష¯ŒS ప్రకటించింది. జస్టిస్‌ సీవై సోమయాజులు ఏకసభ్య కమిష¯ŒS రాజమహేంద్రవరంలోని

  • ‘పుష్కర తొక్కిసలాట’ విచారణపై ఏకసభ్య కమిష¯ŒS ప్రకటన
  • ఆధారాలు, సమాచారం రాతరూపంలో ఇవ్వాలని సూచన
  • సమ్మతించిన అఫిడవిట్‌దారులు, ప్రభుత్వ న్యాయవాది
  • విచారణ వాయిదా.. నేటితో ముగియనున్న గడువు
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న విచారణలో ఆధారాల సేకరణ పూర్తయిందని ఏకసభ్య కమిష¯ŒS ప్రకటించింది. జస్టిస్‌ సీవై సోమయాజులు ఏకసభ్య కమిష¯ŒS రాజమహేంద్రవరంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో శనివారం మరోసారి విచారణ చేపట్టింది. అఫిడవిట్‌ దాఖలు చేసిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిష¯ŒS ద్వారా అడిగిన మేరకు.. ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న సమాచారాన్ని న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు సమర్పించారు. ఆ సమాచారం అసంపూర్తిగా ఉండడంపై కొద్దిసేపు చర్చ జరిగింది. ప్రారంభం నుంచీ ఆధారాలు, సమాచార సేకరణకే సమయం సరిపోయిందని కమిష¯ŒS వ్యాఖ్యానించింది. ముప్పాళ్ల సుబ్బారావు ఇప్పటికీ సమాచారం కోరడంపై చింతపెంట ప్రభాకరరావు అసహనం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్నట్లుగా లేదని ప్రైవేటు వ్యక్తులు ఈ ఘటనపై పరిశోధన చేస్తున్నట్లుగా ఉందని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులు తమవద్ద ఉన్న సమాచారాన్ని నిజాయతీగా కమిష¯ŒSకు సమర్పించి ఉంటే ప్రారంభంలోనే ఈ విచారణ  పూర్తయ్యేదని ముప్పాళ్ల అన్నారు. తద్వారా అందరికీ సమయం, ప్రభుత్వానికి ధనం ఆదా అయ్యేదన్నారు. ఇప్పటికీ సీసీ కెమెరాల ఫుటేజీ, ఘటన జరిగిన రోజు పుష్కర ఘాట్‌ వద్ద పరిస్థితిపై ఎలాంటి సమాచారమూ లేదని గుర్తు చేశారు. సమాచార శాఖ ఇచ్చిన వీడియోను సెకను, రెండు సెకన్ల నిడివితో ముక్కలుముక్కలుగా ఇచ్చారని పేర్కొన్నారు. సమాచార శాఖ చిత్రీకరించిన వీడియో తెప్పించాలని కమిష¯ŒSను కోరారు. సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌లో గంటన్నరపాటు ఉన్నారంటూ ప్రభుత్వమే తెలిపిందని, ఆ సమయంలో ఆయన పక్కన దర్శకుడు బోయపాటి శ్రీను ఎందుకున్నారో చెప్పలేదని అన్నారు. ఆయన చేతిలో మైక్‌ కూడా ఉందని, షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ కోసమే భక్తులను ఆపడంతో తొక్కిసలాట జరిగిందని ముప్పాళ్ళ ఆరోపించారు. ‘ప్రజలకు సూచనలు ఇచ్చేందుకు ఆయనకు మైక్‌ ఇచ్చి ఉండొచ్చు కదా!’ అని కమిష¯ŒS వ్యాఖ్యానించింది. జెడ్‌+ భద్రత ఉన్న సీఎం వద్ద ఓ ప్రైవేటు వ్యక్తి ఎందుకుంటాడని, ప్రజలకు సూచనలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాధికారులదని సుబ్బారావు అన్నారు. ఆ రోజు ఉదయం గోదావరి స్టేష¯ŒSకు ఏడు రైళ్లు వస్తాయని తెలిసినా, భక్తులను ఇతర ఘాట్‌లకు ఉద్దేశపూర్వకంగానే మళ్లించలేదని కమిష¯ŒS దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఏర్పాట్లు, ఇతర వివరాలు ఇవ్వాలని తాము సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా కలెక్టర్‌ కార్యాలయం ఇవ్వలేదని పేర్కొన్నారు. ‘ఉన్న ఆధారాలన్నీ సమర్పించినట్టేనా?’ అని ప్రభుత్వ న్యాయవాదిని, అఫిడవిట్‌దారులను కమిష¯ŒS ప్రశ్నించింది. అనంతరం ఈ ఘటనలో ఆధారాల సేకరణ ముగిసిందని ప్రకటించింది. ఇరుపక్షాల వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం రాతపూర్వకంగా తమకు అందజేయాలని కోరింది. ఇందుకు ఇరుపక్షాలూ అంగీకరించడంతో విచారణను వాయిదా వేసింది. కమిష¯ŒSకు పెంచిన గడువు ఆదివారంతో ముగియనుంది. తదుపరి విచారణలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను మాత్రమే కమిష¯ŒS ఆలకించనుంది. కమిష¯ŒSకు సహాయకారిగా ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. విచారణకు న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాస్, వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్‌ తహసీల్దార్‌ జి.భీమారావు, స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement