బాధ్యత కాదు.. టైం పాస్‌! | pump house subordinates timepass | Sakshi
Sakshi News home page

బాధ్యత కాదు.. టైం పాస్‌!

Aug 27 2016 8:27 PM | Updated on Sep 4 2017 11:10 AM

పంప్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న సిబ్బంది

పంప్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న సిబ్బంది

వర్షకాలంలోనూ గ్రామీణ ప్రాతాల్లో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే... నీటిని పంపింగ్‌ చేయాల్సిన సిబ్బంది మాత్రం దర్జాగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

  • పంప్‌హౌస్‌లో సిబ్బంది పేకాట
  • పుల్‌కల్‌:  ఓ వైపు వర్షకాలంలోనూ గ్రామీణ ప్రాతాల్లో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే... నీటిని పంపింగ్‌ చేయాల్సిన సిబ్బంది మాత్రం దర్జాగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి రోజూ జూదం అడుతూ కాలక్షేపం చేస్తున్నారు. మండల పరిధిలోని పోచారం సత్యసాయి వాటర్‌ సప్లయ్‌ చేసే విభాగంలో పని చేసేందుకు పంపింగ్‌ ఆపరేటర్లను నిమించారు. విడతలవారీగా విధులు నిర్వహిస్తున్నారు.

    24 గంటల పాటు నీటిని పంపింగ్‌ చేస్తూ ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. పంప్‌హౌస్‌లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ దర్జాగా మధ్యాహ్నం మొదలుకొని అర్ధరాత్రి వరకు పేకాట ఆడుతున్నారు. పంపిం‍గ్‌ కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అటు వైపు దృష్టి సారించడం లేదు. ఎప్పుడైనా సమస్య వస్తే కిందిస్థాయి సిబ్బందిని అక్కడికి పంపించి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

    వారంలో ఒక రోజైన ానీటి పంపింగ్‌ కేంద్రాన్ని పరిశీలించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇక్కడ పని చేస్తున్న వారంతా  ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో వారి స్నేహితులను సైతం రప్పించి పంప్‌హౌస్‌లోనే జూదం ఆడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 69 గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేయల్సిన పోచారం పంప్‌హౌస్‌లో సిబ్బంది సక్రమంగా నీటిని పంపింగ్‌ చేయని కారణం‍గా పలు గ్రామాలకు నీరు అందడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు మంజీరలో నీరు లేక పంపింగ్‌ చేయలేదు. ప్రస్తుతం నీరున్నా సిబ్బంది మాత్రం పంపింగ్‌ చేయడం లేదు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కృష్ణను వివరణ కోరగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement