ప్రాజెక్టుల పేరుతో రైతులకు అన్యాయం
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు తక్కువ ధరకు లాక్కోవాలని చూస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందల చంద్రారెడ్డి అన్నారు.
-
మంత్రి నియోజకవర్గంలో ఎక్కువ, ఇతర చోట్ల తక్కువ ధరకు కొనుగోలు
-
తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి
హన్మకొండ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు తక్కువ ధరకు లాక్కోవాలని చూస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందల చంద్రారెడ్డి అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం సంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావు నియోజవర్గంలోని చిన్నకోడూరు మండలం పోచగుట్టపల్లిలో ముంపు ప్రాంత రైతులకు ఎకరానికి రూ.16 లక్షలు ఇచ్చారని, ఇదే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట అనంతగిరిలో మహబూబ్‌నగర్ వట్టెం వద్ద రూ.5.50 లక్షలకే ఎకరం తీసుకుంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద రూ.4.50 లక్షలకు అసైన్డ్ భూమికి పరిహారం కూడా ఇవ్వకపోతే రైతు గుండె పగిలి చనిపోయాడన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ వద్ద ఎకరం అసైన్‌్డ్స భూమికి రూ.8లక్షలు, పట్టా భూమికి రూ.12 లక్షలు ఇస్తూ చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే లిఫ్ట్ పెట్టాల్సిన చోట రిజర్వాయర్లు కడుతున్నారని, సాంకేతిక కమిటీ సూచనలు పాటించడంలేదన్నారు.
ఆలస్యంగా వ్యవసాయ ప్రణాళిక
జూన్ 15న ప్రకటించాల్సిన వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వం నెలరోజులు ఆలస్యంగా ప్రకటించిందన్నారు. కాంటింజెన్సీ ప్రణాళినకు వి డుదల చేయలేదన్నారు. రుణమాఫీ ఒకేసారి చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం వ్యవసాయానికి రూ.64,317 కోట్లు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 43,444 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. జిల్లా నాయకులు పెద్దారపు రమే ష్, గట్ల కొండల్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.