బాల్య వివాహాలతో కుటుంబ సమస్యలు తలెత్తుతాయని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, జడ్జి నీలిమ అన్నారు. జిల్లా న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో మండలంలోని సిద్ధాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం బాల్య వివాహాలపై సదస్సు నిర్వహించారు.
బాల్య వివాహాలతో సమస్యలు
Aug 18 2016 12:11 AM | Updated on Sep 4 2017 9:41 AM
హసన్‌పర్తి : బాల్య వివాహాలతో కుటుంబ సమస్యలు తలెత్తుతాయని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, జడ్జి నీలిమ అన్నారు. జిల్లా న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో మండలంలోని సిద్ధాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం బాల్య వివాహాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారితో పాటు తల్లిదండ్రులు, పురోహితుడిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. అనంతరం సిద్ధాపురంలో లీగల్ లిటరరీ క్లబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ గోడకు ఫిర్యాదుల బాక్స్‌ను అమర్చారు. ఈ సందర్భంగా సమాజంలో జరుగుతున్న బాల్యవివాహాలు, వరకట్న వేధింపులపై ప్రొజెక్టర్ ద్వారా చిత్రాలను ప్రదర్శించారు. సర్పంచ్ ఈశ్వరి అధ్యక్షతన జరిగిన సదస్సులో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జనగాని కిరణ్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంఈఓ రవీందర్, హెచ్‌ఎం శోభారాణి, ఎస్‌ఎంసీ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement