సార్వత్రిక సమ్మె పోస్టర్‌ ఆవిష్కరణ | Poster Launch of general strike | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మె పోస్టర్‌ ఆవిష్కరణ

Aug 19 2016 12:43 AM | Updated on Sep 4 2017 9:50 AM

కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పిలుపునిచ్చారు.

సూర్యాపేట మున్సిపాలిటీ : కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పిలుపునిచ్చారు. గురువారం చండ్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబర్‌ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు జీవించడానికి కనీస వేతనం రూ. 18 వేలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక చట్టాల సవరణ నిర్ణయాన్ని, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కారింగుల వెంకన్న,పరమేష్, షేక్‌ సయ్యద్, మధు, వీరయ్య, రహీం, రవి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement