ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి శోభ | pongal celebrations at durga temple | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి శోభ

Jan 13 2017 6:36 PM | Updated on Jul 6 2018 3:32 PM

ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి శోభ - Sakshi

ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి శోభ

సంక్రాంతి శోభతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో చక్కగా అలంకరించగా, భోగి మంటలు, చిన్నారులపై భోగిపళ్లు, గంగిరెద్దులు విన్యాసాలు కొండకు మరింత అందాన్ని తెచ్చాయి.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : సంక్రాంతి శోభతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో చక్కగా అలంకరించగా, భోగి మంటలు, చిన్నారులపై భోగిపళ్లు, గంగిరెద్దులు విన్యాసాలు కొండకు మరింత అందాన్ని తెచ్చాయి. ఆలయ ఈవో సూర్యకుమారి గంగిరెద్దుల కళాకారులకు, హరిదాసులకు నూతన వస్త్రాలు, స్వయంపాకం, నగదు అందజేశారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, అర్చకుడు వి.లక్ష్మీనరసింహారావు (బుజ్జి) తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి దేవినేని
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈవో సూర్యకుమారి ఆయనకు సాదరంగా స్వాగతం పలకగా,  దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈవో అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాలను ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలను మంత్రి తిలకించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement