నయీం డైరీల్లో కీలక వివరాలు | police seized nayeems dairy | Sakshi
Sakshi News home page

నయీం డైరీల్లో కీలక వివరాలు

Aug 9 2016 3:30 PM | Updated on Oct 16 2018 9:08 PM

నయీం డైరీల్లో కీలక వివరాలు - Sakshi

నయీం డైరీల్లో కీలక వివరాలు

ఎన్కౌంటర్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి.

హైదరాబాద్: ఎన్కౌంటర్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. డబ్బు, బంగారం, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వందల సంఖ్యలో బ్యాంకు పాస్బుక్లు, చెక్బుక్లతో పాటు నయీం డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు శంషాబాద్ డీసీపీ  చెప్పారు. ల్యాండ్ సెటిల్మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని తెలిపారు. నయీం తనకుతానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు చెప్పారు.

బలవంతపు వసూళ్ల వివరాలను నయీం డైరీలో రాసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఇచ్చినది, ఖర్చు చేసిన వివరాలు డైరీలో ఉన్నాయని చెప్పారు. నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని తెలిపారు. షెల్టర్లు, డెన్లకు సంబంధించిన తాళాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నయీం టార్గెట్ చేసిన ధనవంతుల వివరాలను డైరీలో రాశాడని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నయీం బంధువులు, అనుచరులు ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement