అమరవీరులారా..జోహార్‌ | police commemoration day | Sakshi
Sakshi News home page

అమరవీరులారా..జోహార్‌

Oct 21 2016 11:34 PM | Updated on Aug 21 2018 5:54 PM

అమరవీరులారా..జోహార్‌ - Sakshi

అమరవీరులారా..జోహార్‌

అంతర్గత, శాంతి భద్రతల కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘన నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, కాకినాడ నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ హాజరయ్యారు. పో

  • ఘన నివాళులర్పించిన పోలీస్‌శాఖ
  • కాకినాడ క్రై ం :
    అంతర్గత, శాంతి భద్రతల కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘన నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, కాకినాడ నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌  హాజరయ్యారు. పోలీసు అమరవీరుల ఆత్మశాంతిని కోరుతూ మౌనం పాటించారు. పుష్షగుచ్చాలతో అమరవీరుల స్థూపం వద్ధ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల జాబితాను ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి  చదివి వినిపించారు. అనంతరం అమర పోలీస్‌ కుటుంబ సభ్యులకు దుస్తులు, చీరలు అందించారు. పోలీస్‌ వారోత్సవాలను పురస్కరించుకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన, కార్టూ¯ŒS పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కార్యాలయం నుంచి భానుగుడిసెంటర్‌ వరకూ పోలీసులు, శ్యామ్‌ ఇన్టిట్యూట్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌బీ సీఐ శ్రీనివాసరావు, సీఐలు చైతన్య కష్ణ, వి.పవ¯ŒSకిషోర్, మురళీకష్ణారెడ్డి, తదితర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.అనంతరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్‌ అమరవీరుల సమాచారాన్ని తెలిపే తూర్పు సింధూరం పుస్తకాన్ని వక్తలు ఆవిష్కరించారు. 
    జిల్లా విజేతలు వీరే..
    వ్యాసరచన, కార్టూ¯ŒS పోటీలో అమలాపురానికి చెందిన మహర్షి పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఎ¯ŒSఎస్‌డీఎ¯ŒS సాయినా«థ్‌ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని
     
    గెలుచుకున్నాడు. చిత్రలేఖన పోటీలో సామర్లకోటకు చెందిన ప్రగతి పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని వై.రమ్యప్రియ ప్రథమ బహుమతి సాధించింది. 
    ఎస్సైలకు నిర్వహించిన వ్యాసరచనలో సర్పవరం ఎసై డి.తమ్మినాయుడు ప్రథమ బహుమతి, కానిస్టేబుల్‌ విభాగంలో  కిర్లంపూడి స్టేష¯ŒSకి చెందిన అబ్దుల్‌ దురానీ ప్రథమ బహుమతి సాధించారు.
     
    మృతవీరుల త్యాగాలు మరువలేనివి
    రాజమహేంద్రవరం క్రైం : 
    కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పోలీసులు విధి నిర్వహణలో చేసే త్యాగాలు మరువలేనివని రాజమహేంద్రవరం పోలీస్‌ అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముగింపు   కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాంపేట పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్స్‌లో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. ఈ నందర్భంగా నగరంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌరులంతా చట్టాలను గౌరవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా జీవించడమే పోలీస్‌ అమర వీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేయాలని సంఘంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాజమహేంద్రవరం నగర వీధుల్లో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్‌లో ఏర్పాటు చేసిన అమర వీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ సీసీసీ చానల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రెండు కళ్లు దెబ్బతిని అంగవైకల్యంతో ఉన్న ఆత్మారావు అనే ఏఆర్‌ కానిస్టేబుల్‌ను ఎస్పీ రాజకుమారి, సీసీసీ చానల్‌ ఎండీ పంతం కొండల రావు, అడిషనల్‌ ఎస్పీ గంగాధరరావు, టి.కె. విశ్వేశ్వరరెడ్డి చేతులు మీదుగా సత్కరించారు. భారీ గజమాలను అమర వీరుల స్తూపానికి వేసి ఎస్పీ రాజ కుమారి, సీసీసీ చానల్‌ ఎండీ పంతం కొండలరావు నివాళులర్పించారు.  
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement