నేడు పోలేరమ్మజాతర తొలిచాటింపు | Poleramma Jatara | Sakshi
Sakshi News home page

నేడు పోలేరమ్మజాతర తొలిచాటింపు

Sep 7 2016 1:32 AM | Updated on Sep 4 2017 12:26 PM

నేడు పోలేరమ్మజాతర తొలిచాటింపు

నేడు పోలేరమ్మజాతర తొలిచాటింపు

వెంకటగిరి: జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సంబంధించి తొలిచాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.

 
  •  21, 22 తేదీల్లో జాతర
  • వెంకటగిరిలో శుభకార్యాలు బంద్‌
వెంకటగిరి:
జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సంబంధించి తొలిచాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన  జాతరలో సంప్రదాయాలకు పెద్దపీట వేయడం ఆనవాయితీ. జాతరకు సంబంధించి తొలిచాటు వేసిన రోజు నుంచి జాతర ముగిసేవరకూ వెంకటగిరిలో శుభకార్యాలు నిర్వహించరు. తరాలుగా వస్తున్న సంప్రదాయాలను నేటికీ ఆచరించడం విశేషం. ఈనెల 21, 22 తేదీలో నిర్వహించే జాతరకు సంబంధించి బుధవారం రాత్రి స్థానిక కాంపాళెంలో గాలిగంగుల దేవస్థానం వద్ద పూజలు నిర్వహించారు. 
రెండోచాటు ఈనెల 14న
 వినాయకచవితి తరువాత వచ్చే తొలి బుధవారం తొలిచాటు, రెండో బుధవారం రాత్రి రెండో చాటు వేయడం ఆనవాయితీ.  ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన జాతరకు సంబంధించి రెండో చాటు వేయనున్నారు. అనంతరం 18వ తేదీ నుంచి పట్టణంలో ఘటోత్సవం ప్రారంభం అవుతుంది. 21వ తేదీ రాత్రి అమ్మవారి నిలుపు, 22వ తేదీన నిమజ్జనం కార్యక్రమాలతో జాతర ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement