రాజాంలో నవదుర్గామాతకు పూజలు చేస్తున్న ఏసీ శ్యామలాదేవి.
జిల్లాలోని దేవాదాయ శాఖ భూములు, ఆస్తుల రికవరీకి చర్యలు చేపడుతున్నామని జిల్లా దేవాదాయ శాఖ ఏసీ శ్యామలాదేవి అన్నారు. రాజాం నవదుర్గా మాత ఆలయంలో శనివారం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఆమెను సత్కరించారు.
రాజాం(సంతకవిటి): జిల్లాలోని దేవాదాయ శాఖ భూములు, ఆస్తుల రికవరీకి చర్యలు చేపడుతున్నామని జిల్లా దేవాదాయ శాఖ ఏసీ శ్యామలాదేవి అన్నారు. రాజాం నవదుర్గా మాత ఆలయంలో శనివారం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఆమెను సత్కరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చిన సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించామని తెలిపారు.
జిల్లాలో దేవాదాయశాఖ భూముల వివరాలు మొత్తం సేకరించడంతో పాటు వాటి నుంచి రావాల్సిన ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాలు అన్వేషించామని అన్నారు. ఈ భూములు ఆక్రమించి అనుభవిస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కౌలు రైతులు దేవదాయ శాఖ భూములను వెబ్ అడంగల్‌లో తమ పేరును నమోదు చేసుకునే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వానపల్లి నర్శింగరావు, ఈఓ వాసుదేవరావు, గురుభవాని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.