
విశాఖ,సాక్షి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో చంద్రబాబు సర్కారుపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. నిర్మాణం లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. సింహాచలంలో పాలన కాదు. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త. భగవంతుడికి భక్తులను దూరం చేయడమే వారి పని. హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాలకుల కంబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తే భక్తులకు మంచి జరుగుతోంది.

చందనోత్సవంలో ఓ ప్రణాళిక లేదు. ప్లానింగ్ లేదు. సింహాచలంలో హిందూ భక్తులకు గౌరవమే లేదు. హుండీలో వేసే డబ్బు తోటే ఎండో మెంట్ వ్యవస్థ నడుస్తోంది. కానీ ఆ భక్తులను పట్టించుకోవడం లేదు. వీఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత సామాన్య భక్తులకు లేదు. హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన వాళ్లకు మాత్రమే ఎండోమెంట్‌లో ఉండాలి’ అని డిమాండ్ చేస్తోంది.
Eight Devotees Killed, Several Injured in Wall Collapse During Chandanotsavam at Simhachalam Temple
Tragedy struck the sacred hill shrine of Simhachalam in the early hours of Wednesday when a newly constructed wall at the Rs. 300 ticket queue line collapsed, leaving at least… pic.twitter.com/z2Gk8OR8Qp— Sudhakar Udumula (@sudhakarudumula) April 29, 2025