ప్రణాళికాద్ధంగా విద్యాబోధన | Planingly Education Teaching | Sakshi
Sakshi News home page

ప్రణాళికాద్ధంగా విద్యాబోధన

Aug 31 2016 12:24 AM | Updated on Jul 11 2019 5:12 PM

నవాబుపేట ఉపాద్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న పిఓ గోవిందరాజులు - Sakshi

నవాబుపేట ఉపాద్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న పిఓ గోవిందరాజులు

నవాబుపేట: ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన చేయాలని ఆర్‌వీఎం పీఓ గోవిందరాజులు తెలిపారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి, నవాబుపేట గ్రామాల్లోని పాఠశాలలో జరిగిన ప్రదానోపాధ్యాయుల కాంప్లెక్స్‌ సమావేశాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయలకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న చతుర్విద ప్రక్రియల ఆధారంగా విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించారు.

–ఆర్‌వీఎం పీఓ గోవిందరాజులు
నవాబుపేట: ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన చేయాలని ఆర్‌వీఎం పీఓ గోవిందరాజులు తెలిపారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి, నవాబుపేట గ్రామాల్లోని పాఠశాలలో జరిగిన ప్రదానోపాధ్యాయుల కాంప్లెక్స్‌  సమావేశాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయలకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న చతుర్విద ప్రక్రియల ఆధారంగా విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించారు. ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు పరిశీలించి చతుర్విద ప్రక్రియలపై పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయులకు గ్రేడింగ్‌ వేస్తారని ఆయన తెలిపారు. గతంలో మాదిరిగా మొక్కుబడి చదువులు మానివేసి ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు చదవటం, రాయటం, మాట్లాడటం లాంటివి రావాలని సూచించారు. పాఠశాలలో రికార్డులు విధిగా రాయాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని హెచ్చరించారు . విద్యా కమిటీలతో కలిసి నెలవారి సమావేశాలు నిర్వహించాలన్నారు.మధ్యాహ్న భోజనం విద్యాకమిటీ పరిశీలించే విధంగా చార్టు రుపొందించాలన్నారు. సమావేశంలో మండల విద్యా శాఖ అధికారి ఆనంతప్ప, హెచ్‌ఎంలు ఫరహ, ఉషరాణీలు పాల్గొన్నారు.
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement