ఫిజియోథెరపీదే కీలక పాత్ర
శస్త్రచికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకోవడంలో ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుందని రమేష్ హాస్పిటల్స్ ప్రముఖ ఆర్ధోపెడిక్ శస్త్రవైద్యనిపుణులు డాక్టర్ రావి పవన్‌కుమార్ అన్నారు.
అరండల్‌పేట: శస్త్రచికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకోవడంలో ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుందని రమేష్ హాస్పిటల్స్ ప్రముఖ ఆర్ధోపెడిక్ శస్త్రవైద్యనిపుణులు డాక్టర్ రావి పవన్‌కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్బంగా సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాల విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ రావి పవన్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదన్నారు. చాలా సమస్యలకు ఫిజియోథెరపిలో ఉపశమనం ఉందన్నారు. ఫిజియోథెరపీపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిమ్స్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బి.శివశిరీష, డైరెక్టర్ భీమనాధం భరత్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసులు, మేనేజర్ రాంబాబు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.