పీహెచ్‌సీల్లో ప్రసవాలకు చర్యలు | phcs delivery cases | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో ప్రసవాలకు చర్యలు

Nov 15 2016 9:45 PM | Updated on Sep 4 2017 8:10 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.చంద్రయ్య ఆదేశించారు. కాకినాడ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం డివిజన్ల పరి«ధిలోని వైద్యాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసవాలన్నీ కాకినాడ ప్రభుత్వ ఆçస్పత్రికి తరలించడంతో ఒత్తిడి

కాకినాడ వైద్యం :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.చంద్రయ్య ఆదేశించారు. కాకినాడ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం డివిజన్ల పరి«ధిలోని వైద్యాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసవాలన్నీ కాకినాడ ప్రభుత్వ ఆçస్పత్రికి తరలించడంతో ఒత్తిడి పెరుగుతుందని, పీహెచ్‌సీల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. నెలలో పది రోజుల్లో కనీసం 20 ప్రసవాలు పీహెచ్‌సీల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణుల వివరాలు నూరు శాతం ఆ¯ŒSలై¯ŒSలో అప్‌లోడ్‌ చేయాలన్నారు. 85 శాతం పైబడి చేసిన నమోదు చేసిన ఏఎ¯ŒSఎంలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ.2 వేలు ఇస్తామన్నారు. వచ్చే ఏడాది జవనరి 29, ఏప్రిల్‌ రెండున పల్స్‌పోలియో జరుగుతుందన్నారు. అనంతరం వ్యాధి నిరోధక టీకాలు, క్షయ, మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాల నివారణ, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. డీటీబీసీవో డాక్టర్‌ ప్రసన్నకుమార్, డీపీఎంవో డాక్టర్‌ కె.సత్యనారాయణ, డీసీ జేబార్‌ డాక్టర్‌ ఎ¯ŒS.రాజేశ్వరి, డీఎంవో పీఎస్‌ఎస్‌ ప్రసాద్, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement