breaking news
phcs
-
డోలీలే దిక్కు గర్భిణులు బిక్కు.. బిక్కు
విజయనగరం జిల్లా కొండ శిఖర గ్రామం రేగపుణ్యగిరికి చెందిన నిండు గర్భిణికి మే ఒకటో తేదీన పురిటి నొప్పులు వచ్చాయి. వాహనంలో ఆస్పత్రికి తరలించే వీలు లేక డోలీలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరే లోపే నొప్పులు తీవ్రమై మార్గమధ్యంలోనే గర్భిణి ప్రసవించింది. పాడేరు మండలం వరంకుర గ్రామానికి చెందిన గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తరలించే సమయం లేకుండా పోయింది. దీంతో ఇంట్లోనే ప్రసవించాల్సిన పరిస్థితి తలెత్తింది. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవానంతరం తల్లి కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం గ్రామస్తులు కిలోమీటర్ల కొద్ది డోలీలో మోసుకుని వెళ్లి ఆస్పత్రికి తరలించారు. గతేడాది నవంబర్‌లో సీతంపేట ఏజెన్సీ అంటికొండ పెద్దగూడలో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డోలీలో ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో గ్రామంలోని మహిళలే ఇంట్లో ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. – సాక్షి, అమరావతిఇవీ గిరిజన ప్రాంతాల్లో కాబోయే తల్లుల ప్రసవ వేదనలకు అద్దం పట్టే ఉదంతాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి నిత్యం ఏజెన్సీ ప్రాంతాల్లో చోటుచేసుకోవడం పరిపాటైపోయింది. పురిటి నొప్పుల సమయంలో డోలీలో తరలించడం, అదృష్టం బాగుంటే దారిలోనే కాన్పు సుఖాంతం కావడం జరిగిపోతుంటాయి. కానీ ప్రశాంతంగా ఆసుపత్రిలో బిడ్డను కనే అదృష్టానికి సగటు గిరిమహిళ నోచుకోలేకపోతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు సంరక్షణ పటిష్టంగా అమలవడం లేదనడానికి పై ఘటనలే నిదర్శనం.అక్కరకు రాని బర్త్ వెయిటింగ్ హోమ్స్ ఏజెన్సీ ప్రాంతాల ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ హోమ్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచి్చంది. అయితే ఈ నివాసాలు అలంకార ప్రాయంగా మారాయి. గర్భిణులను ప్రసవానికి ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్‌కు తరలించి సురక్షిత ప్రసవాలు చేపట్టడం ఈ హోమ్స్ ప్రధాన లక్ష్యం. కానీ ఆ దిశగా వాటిని అక్కరకు తీసుకువచ్చేలా ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. దీంతో ఏజెన్సీలోని కాబోయే తల్లులు, నవజాత శిశువుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ఏదీ ఆ చొరవ?రాష్ట్రంలో 8 ఐటీడీఏలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏటా 50 వేల మంది మహిళలు గర్భం దాలుస్తుంటారు. గిరిశిఖర గ్రామాల్లోని గర్భిణులు పురిటి నొప్పులు మొదలయిన వెంటనే ఆస్పత్రులకు వెళ్లడం ఎంతో కష్టం. కనీసం రవాణా సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో ఇక్కడి గర్భిణులను ప్రసవ తేదీకి 7–10 రోజుల ముందే బర్త్ వెయిటింగ్ హోమ్‌కు తరలించాలి. ఇందు కోసం గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో గిరిజన, వైద్య శాఖల ఆ«ధ్వర్యంలో 76 బర్త్ వెయిటింగ్ హోమ్స్ ఉన్నాయి. పీహెచ్సీ ల పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సిబ్బంది దగ్గరుండి ఆస్పత్రులకు చేర్చాలి. కానీ అలాంటి చొరవ క్షేత్రస్థాయిలో కానరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విధిలేక గర్భిణీని డోలీలపై మోస్తూ ఆస్పత్రులకు చేర్పించాల్సిన పరిస్థితి తప్పడం లేదు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నిర్లక్ష్యంపీహెచ్సీల వారీ గర్భిణుల వివరాలు నమోదై ఉంటాయి. ప్రసవ నిర్ధారణ తేదీ (ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్)ని ముందుగానే నిర్ణయిస్తారు. కాబట్టి గర్భిణులను డెలివరీ తేదీకి ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్‌కు తరలించడం సులువైన అంశం. కానీ అలాంటి చొరవ క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. దీంతో డోలీల్లో ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి అవస్థలు ఈ యుగంలో తప్పేలా లేవంటూ గిరి మహిళలు నిట్టూరుస్తున్నారు. -
పీహెచ్‌సీల్లో ఉచిత మందులు కరవు
చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ కుప్పకూలింది. వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు, ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పీహెచ్‌సీల్లో (ప్రైమరీ హెల్త్ సెంటర్) మందులకు తీవ్ర కొరత నెలకొంది. వైద్యం కోసం పీహెచ్‌సీలకు వెళ్లిన వారిలో సగం మందికి పైగా రోగులకు ఉచిత మందులను ప్రభుత్వం అందించలేకపోతోంది. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన తాజా ఐవీఆర్ఎస్ సర్వేలోనే వెల్లడైంది. ఉమ్మడి 13 జిల్లాల వారీగా చేపట్టిన సర్వేలో ఏకంగా 43 నుంచి 55 శాతం మంది రోగులు ఉచిత మందులు అందలేదని స్పష్టం చేశారు. అదే విధంగా పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్య సేవలపైనా 40 శాతం వరకూ రోగులు అసంతృప్తిగా ఉన్నారు. –సాక్షి, అమరావతిసీఎం సొంత జిల్లాలో అధ్వాన్నంఏడాది పాలనలో ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం పీహెచ్‌సీల్లో 200 రకాలకు పైగా ఉచిత మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, సగానికిపైగా మందులను ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.స్వయంగా సీఎం చంద్రబాబు సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 48 శాతం మంది రోగులకు ఉచిత మందులు అందలేదని వెల్లడైంది. ఇక వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంత జిల్లాలో ఏకంగా 55 శాతం మంది రోగులు తమకు ఉచిత మందులు అందలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తేలింది. ఇక పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్య సేవల విషయంలో చిత్తూరు జిల్లాలో 36 శాతం, అనంతపురం జిల్లాలో 40 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కూటమి పాలనలో నిద్రావస్థలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
-
ప్రజారోగ్యానికి ‘రక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఫ్యామిలీ డాక్టర్ విధానం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో నూతన ఒరవడికి నాంది పలికాం. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎవరూ, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేగలిగాం. వీటిలో పూర్తి స్థాయిలో వనరులన్నీ సమకూర్చాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా చర్యలు చేపట్టాం. పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ఒక 104 వాహనాన్ని సమకూర్చాం. పీహెచ్‌సీల్లోని వైద్యులకు ఆ మండలంలోని గ్రామాలను విభజించి వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్సీలో సేవలు అందిస్తుంటే మరొకరు 104 ఆంబులెన్స్‌లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇలా తనకు కేటాయించిన గ్రామాలను ప్రతి వైద్యుడు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. క్రమం తప్పకుండా ఓ గ్రామానికి వైద్యుడు వెళ్లడం వల్ల ఆర్నెల్లలో గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్య పరంగా ఏ అవసరాలున్నాయనేది గుర్తించి మెరుగైన వైద్య సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. అప్పులపాలయ్యే పరిస్థితులు రాకుండా దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు బారినపడితే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అప్పుల పాలయ్యే పరిస్థితులు రాకుండా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అండగా ఉంటున్నాం. టీడీపీ హయాంలో కేవలం 1,056 ప్రోసీజర్స్‌కు పరిమితం కాగా ఇప్పుడు 3256కు ప్రొసీజర్స్‌ను పెంచాం. గతంలో 915 నెట్వర్క్ ఆసుపత్రులుంటే ఈ రోజు 2,200 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. ప్రజలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా ఉండాలనే ఈ చర్యలన్నీ చేపట్టాం. ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్నా గుర్తించేలా సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నాం. అనంతరం గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్టు డాక్టర్లతో చికిత్స అందిస్తున్నాం. రోగం నయం అయ్యే దాకా సంబంధిత వ్యక్తిని చేయిపట్టి నడిపిస్తాం. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు ఏరకంగా పొందాలనే విషయాలను వివరించాలి. వైద్య సేవలు పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియచేయాలి. అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేయాలి. క్యాన్సర్, డయాలసిస్ రోగులకు ఖరీదైన మందులు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందిస్తాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి ఐదు దశలను క్రోడీకరిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఇప్పటికే అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. గ్రామస్ధాయి నుంచి నెట్ వర్క్ అంతా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు తమ విధులను బాధ్యతగా భావించాలి. కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా), అసోసియేషన్ ఆఫ్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భాగస్వామ్యం అయ్యాయి. వీరందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఐదు దశలుగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మొదటి దశ: మొదటి దశ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, సీఎం జగన్ ప్రభుత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వారెవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. ఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు? ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అనే వివరాలు ప్రజలకు చెప్పాలి. అనంతరం సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఆయా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంపై వాకబు చేస్తారని, ఏడు రకాల టెస్టులు నిర్వహించేందుకు వీలుగా వారి వద్ద కిట్స్ ఉంటాయని తెలియచేయాలి. రెండో దశ: గ్రామంలోని విలేజ్ క్లినిక్‌లో ఒక భాగానికి సీహెచ్‌వో, మరొక భాగానికి ఏఎన్ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటిని జల్లెడ పడతారు. ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేపడతారు. ఇలా ఏడు రకాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్ చేసి పుడ్ సప్లిమెంటేషన్ కోసం చర్యలు చేపడతారు. మూడో దశ: గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంపునకు మూడు రోజుల ముందు వలంటీర్లు, గృహసారధులు, ఔత్సాహికులు, ప్రభుత్వం పట్ల, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవారంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళతారు. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. హెల్త్ క్యాంపులో పాల్గొనాలని సూచిస్తారు. రెండో దశలో ఇచ్చిన టోకెన్ నెంబర్లు ఉన్నవాళ్లు తప్పకుండా క్యాంపులో హాజరవ్వాలని వివరిస్తారు. టోకెన్ లేకపోయినా వైద్యం అవసరమైన వారు కూడా హెల్త్ క్యాంపులకు రావచ్చని తెలియజేస్తారు. నాలుగో దశ: హెల్త్ క్యాంపుల నిర్వహణ ఈ దశలో ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహించే రోజు వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్‌వోలు, ఔత్సాహికులు మమేకమవుతారు. క్యాంప్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా చూస్తారు. మందులు సమకూర్చడం, ఇతర సహాయ సహకారాలు అందిస్తారు. సంబంధిత వ్యక్తులను విలేజ్ క్లినిక్స్ వారీగా ఫ్యామిలీ డాక్టర్, ఏఎన్ఎంలకు మ్యాప్ చేస్తారు. మ్యాప్ అయిన వ్యక్తులకు తర్వాతి రోజుల్లో తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడం, చికిత్స అనంతరం మందులు, రెగ్యులర్ ఫాలో అప్ చేపడతారు. ఐదో దశ: ఈ దశలో ప్రజలను చేయిపట్టుకుని నడిపిస్తాం. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తాం. ఆయా వ్యక్తుల పర్యవేక్షణ బాధ్యతలను వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌వోలు తీసుకుంటారు. చికిత్స అందించడంతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్యంపై వాకబు చేస్తారు. -
8 జిల్లాల్లో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లు
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా 134 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన కొండాపూర్ జిల్లా ఆస్పత్రి నుంచి వర్చువల్‌గా 8 జిల్లాల్లో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లు, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్‌లను ప్రారంభించారు. అనంతరం కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్, రేడియాలజీ ల్యాబ్, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 31 జిల్లాలలోని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలలో రోగులకు ఉచితంగా 134 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా పీహెచ్సీలలో నమూనాలు ఇస్తే టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లలో పరీక్షలు చేసి 24 గంటల్లో పేషెంట్, డాక్టర్ల ఫోన్లకు రిపోర్ట్లు పంపుతారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే రోగులకు ఉచిత పరీక్షలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రేడియాలజీ ల్యాబ్‌లలో మహిళల్లో కేన్సర్‌ను గుర్తించేందుకు మెమోగ్రామ్, హై అండ్ అల్ట్రాసౌండ్, టీఫా స్కాన్, ఎక్స్‌రే మిషన్, 2డికో ఏకో మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. నారాయణ పేట, మేడ్చల్ జిల్లాలలో త్వరలోనే ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలన్నారు. కొత్తగా 1,400 మంది ఆశావర్కర్లు నిమ్స్‌లో త్వరలో రోబోటిక్ వైద్య పరికరాలు తీసుకొచ్చి.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మంచి వైద్య సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కొత్తగా మరో 1,400 మంది ఆశావర్కర్లు రానున్నారని మంత్రి తెలిపారు. కాగా, తెలంగాణ డాక్టర్లు కరోనా సమయంలో చాలా అద్భుతంగా పని చేశారని, ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, బండ ప్రకాశ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ శ్వేత మొహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ వరదాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పీహెచ్‌సీల పనితీరుపై తప్పుడు ప్రచారం తగదు: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కానీ, కొన్ని పత్రికలు మాత్రం ప్రజలకు అందిస్తున్న వైద్యం విషయంలో తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో పీహెచ్‌సీల పని తీరుపై హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, కృష్ణబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతీ మండలంలో అందుబాటులోకి పీహెచ్‌సీలను తీసుకువచ్చాము. టెలి మెడిసిన్ సదుపాయంతో అందరికీ వైద్య సౌకర్యం అందుబాటులోకి తెచ్చాము. పీహెచ్సీలో అన్ని రకాల మందులు, పరికరాలు అందుబాటులో ఉంటాయి. పీహెచ్సీలో గర్భిణీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నాము. మూడేళ్లలో వైద్యారోగ్య శాఖలో 45వేల నియామకాలు జరిగాయి. అందులో 4500 వరకు డాక్టర్ల నియామకాలు కూడా జరిగాయి. ఇంకా వైద్యుల నియామకాలు కొనసాగుతున్నాయి. విలేజ్ హెల్త్ క్లీనిక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. రెఫరల్ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టు సహా అన్ని విభాగాల వైద్యులు ఉన్నారు. ప్రతీ పీహెస్సీలో కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్లర్లు లేరని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డాక్టర్లు ఉన్నప్పటికీ వారు లేరని పత్రికల్లో రాయడం సరికాదు. అన్ని చోట్ల వైద్యులు అందుబాటులో ఉన్నారు. స్పెషలిస్టులకు అన్ని రకాల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాము’ అని స్పష్టం చేశారు. -
పీహెచ్‌సీల్లో ప్రసవాలకు చర్యలు
కాకినాడ వైద్యం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.చంద్రయ్య ఆదేశించారు. కాకినాడ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం డివిజన్ల పరి«ధిలోని వైద్యాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసవాలన్నీ కాకినాడ ప్రభుత్వ ఆçస్పత్రికి తరలించడంతో ఒత్తిడి పెరుగుతుందని, పీహెచ్‌సీల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. నెలలో పది రోజుల్లో కనీసం 20 ప్రసవాలు పీహెచ్‌సీల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణుల వివరాలు నూరు శాతం ఆ¯ŒSలై¯ŒSలో అప్లోడ్ చేయాలన్నారు. 85 శాతం పైబడి చేసిన నమోదు చేసిన ఏఎ¯ŒSఎంలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ.2 వేలు ఇస్తామన్నారు. వచ్చే ఏడాది జవనరి 29, ఏప్రిల్ రెండున పల్స్‌పోలియో జరుగుతుందన్నారు. అనంతరం వ్యాధి నిరోధక టీకాలు, క్షయ, మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల నివారణ, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. డీటీబీసీవో డాక్టర్ ప్రసన్నకుమార్, డీపీఎంవో డాక్టర్ కె.సత్యనారాయణ, డీసీ జేబార్ డాక్టర్ ఎ¯ŒS.రాజేశ్వరి, డీఎంవో పీఎస్ఎస్ ప్రసాద్, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.