ఆర్‌టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి | person died by hitting rtc bus | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

Mar 22 2017 10:14 PM | Updated on Sep 5 2017 6:48 AM

ఆర్‌టీసీ బస్సు ఢీకొని కె.నాగలాపురంకు చెందిన కుర్వ ఎల్లయ్య(46) మృతి చెందాడు.

గూడూరు రూరల్‌: ఆర్‌టీసీ బస్సు ఢీకొని కె.నాగలాపురంకు చెందిన కుర్వ ఎల్లయ్య(46) మృతి చెందాడు. పెంచికలపాడు సమీపంలోని కాటన్‌మిల్లు వద్ద బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కె.నాగలాపురానికి  చెందిన కుర్వ ఎల్లయ్యకు భార్య కిష్టమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతనికి 150 వరకు గొర్రెల మంద ఉండగా, వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెంచికలపాడు సమీపంలోని కాటన్‌ మిల్లు వెనుక ఉన్న పొలంలో తన గొర్రెల మందను నిలుపుకున్న కాపరులకు ఇంటి నుంచి భోజనం తీసుకుని రాత్రి 9 గంటలకు బయలుదేరాడు. కాటన్‌ మిల్లు సమీపంలో రోడ్డుపై ఎడమ వైపున ఎల్లయ్య వెళుతుండగా పత్తికొండ డిపోకు చెందిన ఏపీ 21 జెడ్‌ 0148 ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం తెలుసుకున్న కె.నాగలాపురం ఎస్‌ఐ మల్లికార్జున, హెడ్‌కానిస్టెబుల్‌ పెద్దయ్య, కానిస్టేబుల్‌ రామాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement