ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించుకోవాలి | peeraiah calls for success of dharma yudha meeting | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించుకోవాలి

Oct 15 2016 8:42 AM | Updated on Sep 4 2017 5:19 PM

ఐక్యతతో పాలకుల మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించుకోవాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యాదర్శి గుగ్గిళ్ల పీరయ్యమాదిగ పిలుపునిచ్చారు.

గూడూరు: ఐక్యతతో పాలకుల మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించుకోవాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యాదర్శి గుగ్గిళ్ల పీరయ్యమాదిగ పిలుపునిచ్చారు. 20 న హైదరాబాద్‌లో జరగనున్న ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని కోరారు. మండలంలోని సీతానగరంలో చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ శీతాకాల పార్లమెంట్‌ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా పాలకులు స్పందించడానికి, సంఘం జాతీయ అధ్యక్షుడు మందక్రిష్ణమాదిగ హైదరాబాద్‌లో ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ ఇ¯ŒSచార్జి ధర్మారపు కనకయ్యమాదిగ, పాషం సాంబయ్యమాదిగ, కత్తి వెంకన్నమాదిగ, బోడ వెంకన్నమాదిగ, బోడ ఎల్లయ్య, కందిపాటి బిక్షపతి, రమేష్, క్రిష్ణ, సంపత్, లక్ష్మణ్‌మాదిగ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement