ఆర్టీసీ పరకాల డిపో మేనేజర్ ఎల్.మల్లేశంను ఆర్టీసీ కరీంనగర్ ఈ డీకి సరెండర్ చేశారు. కార్మికులను వేధిస్తున్నట్లు ఆయనపై రీజినల్ మేనేజర్ నుంచి ఎండీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణకు వెళ్లిన ఆర్టీసీ విజిలెన్స్ అధికారులపై మల్లేశం అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయమై విజిలెన్స్ అధికారులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
పరకాల డిపో మేనేజర్ మల్లేశం సరెండర్
Sep 3 2016 12:28 AM | Updated on Sep 4 2017 12:01 PM
హన్మకొండ : ఆర్టీసీ పరకాల డిపో మేనేజర్ ఎల్.మల్లేశంను ఆర్టీసీ కరీంనగర్ ఈ డీకి సరెండర్ చేశారు. కార్మికులను వేధిస్తున్నట్లు ఆయనపై రీజినల్ మేనేజర్ నుంచి ఎండీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణకు వెళ్లిన ఆర్టీసీ విజిలెన్స్ అధికారులపై మల్లేశం అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయమై విజిలెన్స్ అధికారులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ ఎంపీ జే.వీ.రమణారావు పరకాల డిపో మేనేజర్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక పంపాలని ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం తోట సూర్యకిరణ్‌ను ఆదేశించారు. ఆయన విచారణాధికారిగా వరంగల్–2 డిపో మేనేజర్ భానుకిరణ్‌ను నియమించగా ఆయన మూడు రోజు ల క్రితం మల్లేశంతోపాటు, కార్మికులను విచారించారు. ఈ క్రమంలో డిపో మేనేజర్‌పై మరి న్ని ఆరోపణలు రావడం, విచారణ కొనసాగుతుండడంతో డీఎం మల్లేశంను కరీం నగర్‌కు ఈడీకి సరెండర్ చేస్తూ వరంగల్ ఆర్‌ఎం తోట సూర్యకిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పరకాల డిపో మేనేజర్‌గా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాల యం పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Advertisement
Advertisement