గ్రామ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు సర్వం సిద్ధమైంది
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నిర్వహించను న్న ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 31,255 మంది అభ్యర్థులు హాజ రుకానున్నారు. అభ్యర్థుల ఇబ్బం దులు దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాగం సంగారెడ్డి, పటాన్‌చెరు, రామచంద్రాపురంలలో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 182 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఒక్కో పోస్టుకు 171 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలనీ, సమయం దాటాక ఎవరినీ అనుమతించమని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లోకి క్యాలిక్యులేటర్లు, మొబైల్‌ఫోన్‌లు ఇతరాత్ర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు.
రెండు విడతలుగా పరీక్ష
పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష రెండు విడతలుగా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి విడతగా పేపర్- 1 జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్- 2 రూరల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే అంశంపై పరీక్ష ఉంటుంది.
పకడ్బందీగా ఏర్పాట్లు
గ్రామ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చే శాం. సంగారెడ్డి, పటాన్‌చెరు, రామచంద్రాపురంలలో 82 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్ష నిర్వహణ కోసం సిబ్బంది నియమించటంతోపాటు రెం డు విడతలుగా వారికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించం
-ఆశీర్వాదం, జడ్పీ సీఈఓ, పరీక్ష నిర్వహణ సమన్వయకర్త
సమయం పేపర్
ఉదయం 10 నుంచి 12.30 పేపర్ 1- జనరల్ స్టడీస్
మధ్యాహ్నం 2 నుంచి 4.30 పేపర్ 2-రూరల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్