కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పాకాల సరస్సు వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
Aug 16 2016 11:45 PM | Updated on Nov 6 2018 7:56 PM
ఖానాపురం : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పాకాల సరస్సు వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. నర్సంపేట మండలంలోని దాసరిపల్లి శివారు సీతారాంనాయక్ తండాకు చెందిన వాంకుడోతు సాంబయ్య(34) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో సోమవారం విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు చేయించడానికి నర్సంపేటకు వచ్చాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం పాకాల చెక్‌పోస్టు సమీపంలో సాంబయ్య ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. దానికి దగ్గర్లోనే అతడు విగత జీవిగా కనిపించాడు. పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి భార్య శాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడు హరీష్, కుమార్తె హారిక ఉన్నారు.
Advertisement
Advertisement