పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి | old pension policy should be implimented | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి

Jul 24 2016 8:42 PM | Updated on Sep 4 2017 6:04 AM

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల 3న నిర్వహించే దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాములు కోరారు

సంగారెడ్డి మున్సిపాలిటీ : విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల 3న ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించే సామూహిక నిరహార దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాగి రాములు కోరారు. ఆదివారం ఐబీలో నిరాహార దీక్ష వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మట్లాడుతూ కంట్రిబ్యూషన్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన అరోగ్యకార్డులు అన్ని కార్పోరేట్, ప్రయివేట్‌ అసుపత్రులలో అన్ని రకాల జబ్బులకు ఉచిత చికిత్సలతో పాటు ఓపీ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, దత్తాత్రి, భాస్కర్‌దేశ్, నర్సింలు, తిరుపతి, అశోక్‌ తధితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement