వడదెబ్బతో వృద్ధుడు మృతి | Old man died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధుడు మృతి

Feb 24 2017 10:08 AM | Updated on Sep 5 2017 4:30 AM

తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు.

సిరిసిల్ల: తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. అప్పుడే వడ దెబ​‍్బతో మృతిచెందుతున్న సంఘటనలు షురూ అయ్యాయి. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పసుల బాణయ్య(60) వడదెబ​‍్బతో మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం పొద్దంతా పొలంలో పనిచేసి రావడంతో వడదెబ్బ తగిలి రాత్రి మృతిచెందాడని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement