పంటనష్టంపై స్పందించని అధికారులు | Officers not responded for crop loss | Sakshi
Sakshi News home page

పంటనష్టంపై స్పందించని అధికారులు

Sep 28 2016 4:44 PM | Updated on Sep 4 2017 3:24 PM

వెల్దుర్తిలో మొలకెత్తిన కంకులు చూపుతున్న రైతులు

వెల్దుర్తిలో మొలకెత్తిన కంకులు చూపుతున్న రైతులు

కుండపోత వర్షాలు, వరదల బీభత్సంతో చేతికి వచ్చిన పంటలు నాశనమైనా అధికారులు స్పందించడం లేదని వెల్దుర్తికి చెందిన రైతులు చెంద్రయ్య, రాజు, మల్లయ్య ఆరోపించారు.

వెల్దుర్తి: కుండపోత వర్షాలు, వరదల బీభత్సంతో చేతికి వచ్చిన పంటలు నాశనమైనా అధికారులు స్పందించడం లేదని వెల్దుర్తికి చెందిన రైతులు చెంద్రయ్య, రాజు, మల్లయ్య ఆరోపించారు. బుధవారం వారు మొలకెత్తిన మొక్కజొన్న కంకులను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నాలుగు రోజులుగా రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు ఫోన్లు చేస్తున్నా స్పందించడం లేదని ఆరోపించారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టాలపై సర్వే చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement