విద్యార్థులకు నోట్‌ పుస్తకాల పంపిణీ | Note books distribute for students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నోట్‌ పుస్తకాల పంపిణీ

Aug 28 2016 6:28 PM | Updated on Sep 4 2017 11:19 AM

విద్యార్థులకు నోట్‌ పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు నోట్‌ పుస్తకాల పంపిణీ

తుర్కపల్లి (రామన్నపేట) : మండలంలోని సూరారం గ్రామపంచాయతీ ఆవాసగ్రామాల్లో రెండునెలల్లోగా ఇంటింటికీ మిషన్‌భగీరథ పథకం కింద కృష్ణాజలాలు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

తుర్కపల్లి (రామన్నపేట) : మండలంలోని సూరారం గ్రామపంచాయతీ ఆవాసగ్రామాల్లో రెండునెలల్లోగా ఇంటింటికీ మిషన్‌భగీరథ పథకం కింద కృష్ణాజలాలు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం సూరారం పరిధిలోని బి.తుర్కపల్లి ప్రాథమికపాఠశాల విద్యార్థులకు అరుంధతీ మేధావుల సంఘంవారు సమకూర్చిన నోట్‌పుస్తకాలను పంపిణీచేసి మాట్లాడారు. ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు, స్వచ్ఛందసంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, ఎంపీటీసీ చల్లా వెంకట్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్‌ బొక్క పురుషోత్తంరెడ్డి, అరుంధతీ  సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి నరహరి, కార్యదర్శి ఎన్‌.కృష్ణ, కోశాధికారి బి.చంద్రకాంత్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, బ్యాంక్‌ రిటైర్డ్‌ మేనేజర్‌ బి.సుదర్శన్, జినుకల ప్రభాకర్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement