ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ | not allowed for late commers | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ

Sep 14 2016 10:58 PM | Updated on Sep 4 2017 1:29 PM

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ

ఏపీపీఎస్సీ ఆధ్వర్యాన బుధవారం చిట్టినగర్‌లోని రుత్విక్స్‌ కళాశాలలో నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షలకు పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు.

 
విజయవాడ (వించిపేట) : ఏపీపీఎస్సీ ఆధ్వర్యాన బుధవారం చిట్టినగర్‌లోని రుత్విక్స్‌ కళాశాలలో నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షలకు పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. సుమారు 30 మంది అభ్యర్థులు నిర్దేశిత సమయానికి రాకపోవడంతో అధికారులు పరీక్షకు పంపలేదు. దీంతో దూరప్రాంతా నుంచి వచ్చామని, అడ్రస్‌ తెలియక ఇబ్బందులు పడుతూ ఇక్కడికి చేరుకున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. తమను అనుమతించాలని కొద్దిసేపు ఆందోళన చేసినా ప్రయోజనం లేకపోవడంతో వెళ్లిపోయారు.  
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement