‘ప్రత్యేక ప్యాకేజీతో ఏం ఒరగదు’ | No use from package | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక ప్యాకేజీతో ఏం ఒరగదు’

Sep 21 2016 11:19 PM | Updated on Jun 2 2018 2:56 PM

కావలి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీ ఏం ఒరగదని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.చెంచలబాబు యాదవ్‌ అన్నారు.

కావలి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీ ఏం ఒరగదని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.చెంచలబాబు యాదవ్‌ అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో హుద్‌హుద్‌ తుపాన్‌ వల్ల జరిగిన నష్టానికి రూ.1500 కోట్లు ఇస్తామన్న కేంద్రం రూ.650 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొందని గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రులను మోసం చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు దానిని స్వాగతించడం దారుణమన్నారు. హాదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయన్నారు. ఈ నెల 28వ తేదీన తిరుపతిలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు శివశేఖర్‌ రెడ్డి, అనుమాలశెట్టి వాసు, ఇంటూరి శ్రీహరి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement