నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా బ్రిటన్‌లోని లండన్ నగరాన్ని సందర్శించారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా బ్రిటన్‌లోని లండన్ నగరాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం భారత సంతతికి చెందిన ఎంపీ, అఖిల పక్ష ఇండో-బ్రిటన్ ఎంపీల చైర్మన్ వీరేంద్ర శర్మ ఆహ్వానం మేరకు పార్లమెంట్‌ను సందర్శించారు.
పార్లమెంటులోని వివిధ విభాగాలను చూపించి, వాటి చరిత్ర గురించి శర్మ వివరించారు. ఎమ్మెల్యే గణేశ్ బిగాల కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ గురించి, రాష్ట్రం సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వీరేంద్ర శర్మను తెలంగాణాకు రావాల్సిందిగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు మహేశ్ బిగాలా, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారైఫోరం-హెడ్ ఆఫ్ అడ్వైసరీ బోర్డు ఉదయ్ నాగరాజు, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ సెక్రటరీ నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.