నరసాపురం రూరల్: 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి పూర్తిస్థాయిలో రోడ్డు వివరాలు సేకరించి సర్వే పనులు పూర్తయ్యాయి.
చురుగ్గా ఎన్‌హెచ్ విస్తరణ పనులు
Aug 25 2016 10:21 PM | Updated on Sep 4 2017 10:52 AM
	నరసాపురం రూరల్: 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి పూర్తిస్థాయిలో రోడ్డు వివరాలు సేకరించి సర్వే పనులు పూర్తయ్యాయి. ఈ పనులను  దక్కించుకున్న టాటా కన్సల్టెన్సీ సిబ్బంది రోడ్డు విస్తరణకు సంబంధించి సర్వే పనులు పూర్తిచేయగా రోడ్డు నిర్మాణానికి సంబందించి అడ్డుగా ఉన్న నిర్మాణాలను, చెట్లను తొలగించే పనులను చించినాడ నుంచి ప్రారంభించి నరసాపురం మండలం వరకు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రస్తుతం నరసాపురం మండలం చిట్టవరం, రుస్తుంబాద, సీతారామపురం సౌత్ గ్రామాల్లో జాతీయ రహదారి మార్జిన్‌లోని వృక్షాలను తొలగిస్తున్నారు. జిల్లాలో సుమారు 53 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే రాకపోకలకు మరింత వీలుంటుంది. 
	 
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
