రూ.4.50 కోట్లతో సత్రం నిర్మాణం | new cottege at bhadrachalam | Sakshi
Sakshi News home page

రూ.4.50 కోట్లతో సత్రం నిర్మాణం

Aug 11 2016 10:57 PM | Updated on Sep 4 2017 8:52 AM

ఆలయ అధికారులతో మాట్లాడుతున్న వెంకటవీరయ్య

ఆలయ అధికారులతో మాట్లాడుతున్న వెంకటవీరయ్య

తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా భద్రా^è లంలో రూ.4.50 కోట్లతో సామాన్య భక్తుల వసతి కోసమని సత్రాన్ని నిర్మించనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

  •  ఆలయాల పునర్నిర్మాణానికి రూ. కోటి 
  • తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ సేవలు విస్తరిస్తాం
  • టీటీడీ పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే వెంకటవీరయ్య
  • భద్రాచలం :  తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా భద్రా^è లంలో రూ.4.50 కోట్లతో సామాన్య భక్తుల వసతి కోసమని సత్రాన్ని  నిర్మించనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం ఆయన రామాలయాన్ని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం రామాలయ అభివృద్ధికి టీటీడీ ద్వారా నిధులు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. భద్రాచలంలో సత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపినందున  దేవదాయశాఖ ఇందుకు అవసరమైన స్థలం కేటాయించేలా ఇప్పటికే ఆ శాఖమంత్రి ఇంధ్రకరణ్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటం జరిగిందన్నారు. తానీషా కల్యాణ మండపం వెనుక అర ఎకరం కేటాయించినందున రెండు నెలల్లో ఈ పనులు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాల పునర్నిర్మాణానికి రూ. కోటి రూపాయాలు కేటాయించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా టీటీడీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement