సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర | Nellore devotees to Shiridi tour | Sakshi
Sakshi News home page

సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర

Sep 18 2016 10:51 PM | Updated on Oct 20 2018 6:19 PM

సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర - Sakshi

సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర

నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్‌ శివారు పద్మావతినగర్‌లోని సాయిదర్బార్‌ అద్దాల మందిరం నుంచి నెల్లూరుకు చెందిన 200 మంది సాయినాథుని భక్తులు ఇరుముడి ధరించి ఆదివారం షిరిడీ యాత్రకు బయల్దేరారు.

 
 నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్‌ శివారు పద్మావతినగర్‌లోని సాయిదర్బార్‌ అద్దాల మందిరం నుంచి నెల్లూరుకు చెందిన 200 మంది సాయినాథుని భక్తులు ఇరుముడి ధరించి ఆదివారం షిరిడీ యాత్రకు బయల్దేరారు. మందిరంలో ప్రత్యేక భజనలు చేశారు. తదుపరి అన్నసంతర్పణ జరిగింది. ఈ సందర్భంగా మందిర మేనేజింగ్‌ ట్రస్టీ మధుసాయి మాట్లాడారు. పదేళ్లుగా నెల్లూరు నుంచి వందలాది మంది భక్తులతో ఇరుముడి ధరించి షిరిడీ యాత్రను చేపడుతున్నామని వివరించారు. బాబా దర్శనం అనంతరం 25వ తేదీన నెల్లూరు చేరుకోనున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement