'త్వరలో మహేష్బాబు వస్తారు' | namrata shirodkar meeting with burripalem villagers | Sakshi
Sakshi News home page

'త్వరలో మహేష్బాబు వస్తారు'

Published Thu, Mar 17 2016 1:25 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

'త్వరలో మహేష్బాబు వస్తారు' - Sakshi

గుంటూరు : బుర్రిపాలెంను స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతామని ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గురువారం నమ్రత గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించారు. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో గ్రామస్తులతో నమ్రత సమావేశమయ్యారు. గ్రామంలో సమస్యలను ఈ సందర్భంగా నమ్రత అడిగి తెలుసుకున్నారు. త్వరలో బుర్రిపాలెంలో ప్రిన్స్ మహేష్ బాబు పర్యటిస్తారని నమ్రత గ్రామస్తులకు తెలిపారు. నమ్రత వెంట మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement