భీమవరంలో నైనా జైస్వాల్‌ సందడి | NAINA JAISWAL IN BHIMAVARAM | Sakshi
Sakshi News home page

భీమవరంలో నైనా జైస్వాల్‌ సందడి

Dec 20 2016 2:35 AM | Updated on Sep 4 2017 11:07 PM

భీమవరంలో నైనా జైస్వాల్‌ సందడి

భీమవరంలో నైనా జైస్వాల్‌ సందడి

ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ సోమవారం భీమవరం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామి, పంచారామక్షేత్రంలోని ఉమా సోమేశ్వర జనార్దనస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

 
భీమవరం (ప్రకాశం చౌక్‌) : ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ సోమవారం భీమవరం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామి, పంచారామక్షేత్రంలోని ఉమా సోమేశ్వర జనార్దనస్వామి వారిని కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు. ఆలయ పాలవర్గ సభ్యులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం జైస్వాల్‌ తన తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మి, తమ్ముడు అర్జునులతో కలసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవంతుని దయ, తల్లిదండ్రుల అశీస్సులతో క్రీడాకారిణీగా రాణించగలుగుతున్నాను అన్నారు. అనంతరం వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు జైస్వాల్‌ను సత్కరించారు. చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకట్రాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 
జైస్వాల్‌కు స్వాగతం 
పలికిన విద్యార్థులు 
కాగా తొలుత క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో స్థానిక సెయింట్‌ మేరీస్, ఆదిత్య ఇంగ్లిష్‌ మీడియం స్కూల్, హౌసింగ్‌ బోర్డు గీతం స్కూల్‌ విద్యార్థులు 500 మీటర్ల జాతీయజెండాతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన విద్యార్థుల సమావేశంలో జైస్వాల్‌ మాట్లాడుతూ తన గురువుల ప్రోత్సహంతో 16 ఏళ్లకే పీహెచ్‌డీ చేశాను అన్నారు. అలాగే తన తమ్ముడు అర్జున్‌11 ఏళ్లకే ఇంటర్‌లోకి వచ్చాడని చెప్పారు. గురువులు, స్నేహితులు, అభిమానుల ప్రోత్సహంతోనే తాను మంచి క్రీడాకారిణిగా రాణిస్తున్నట్టు తెలిపారు. మరింత ఉత్సాహంతో టేబుల్‌ టెన్నిస్‌లో రాణించి దేశానికి గొప్ప పేరు తీసుకురావడం తన లక్ష్యం అన్నారు. విద్యార్థులంతా జాతీయ జెండాతో స్వాగతం పలుకుతున్నప్పుడు జాతీయం భావం తన మనస్సులో ఉప్పొంగిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె సూచించారు. రంగసాయితో పాటు ఆదిత్య కృష్ణంరాజు, పీఈటీ అల్లు అప్పారావు, ఉపాధ్యాయలు ఎం.వన్సమ్మ జార్జ్, బైరెడ్డి నర్సింహరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement