మద్యం బాటిల్‌తో గొంతు కోశారు | Murder attempt on Lodge supervisor | Sakshi
Sakshi News home page

మద్యం బాటిల్‌తో గొంతు కోశారు

Aug 16 2016 11:53 PM | Updated on Jul 30 2018 8:37 PM

చికిత్స పొందుతున్న దినేష్‌రెడ్డి - Sakshi

చికిత్స పొందుతున్న దినేష్‌రెడ్డి

లాడ్జి గదిలో టీవీ రాలేదని.. మద్యం బాటిల్‌తో సూపర్‌వైజర్‌ గొంతు కోసిన సంఘటన వుంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషవుంగా ఉంది.

– లాడ్డి సూపర్‌వైజర్‌ పరిస్థితి విషవుం
శ్రీకాళహస్తి:
లాడ్జి గదిలో టీవీ రాలేదని.. మద్యం బాటిల్‌తో సూపర్‌వైజర్‌ గొంతు కోసిన సంఘటన వుంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషవుంగా ఉంది.
శ్రీకాళహస్తి పట్టణం జయరాంరావు వీధిలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు ఓ గది అద్దెకు తీసుకున్నారు. వుద్యం సేవించారు. తమ గదిలో టీవీ రాలేదని లాడ్జి సూపర్‌వైజర్‌ దినేష్‌ రెడ్డికి తెలియజేశారు. ఆ తర్వాత జీడిపప్పు తీసుకురమ్మన్నారు. అది ఆలస్యం కావడంతో ఆగ్రహించారు. వుద్యం వుత్తులో బాటిల్‌ పగులగొట్టి సూపర్‌వైజర్‌ గొంతుకోసి పరారయ్యారు. వెంటనే లాడ్జిలో పనిచేస్తున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదుచేసి దినేష్‌రెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రథవు చికిత్స చేసి పరిస్థితి విషవుంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కాగా నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ ప్రవీణ్‌కువూర్‌ తెలిపారు. వురో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement