
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ నంజుండప్ప
తమ కుటుంబానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతోనే రైతును ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపారు.
పొలంలో పద్మముని ఒక్కడే కాపలా ఉన్నట్లు నిర్ధారించుకున్న నాగరాజు(35) తన బంధువు రమణయ్య(55)తో కలిసి రాయితో మోది, కత్తితో గొంతుకోసి హత్య చేశారని తెలిపారు. అనంతరం వారు పరారయ్యారని పేర్కొన్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెల్లడి కావడంతో నిందితులు శనివారం ఉదయం వీఆర్‌వో విజయభాస్కర్‌రెడ్డి వద్ద లొంగిపోయి తామే హత్య చేసినట్లు అంగీకరించారని వివరించారు. నిందితులను వీఆర్‌వో పోలీసులకు అప్పగించారని తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంతో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐలతోపాటు పోలీసు సిబ్బంది రమణ, వరప్రసాద్, శేఖర్, మధులకు రివార్డులు ఇవ్వాలని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మికి విన్నవించినట్లు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు చెప్పారు.