గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
నాదెండ్ల(గుంటూరు): గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి ఎనిమిదినెలల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసింది. ఈ సంఘటన జిల్లాలోని నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతుల మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం జరిగింది.
దీంతో మనస్తాపానికి గురైన భార్య తన ఎనిమిది నెలల చిన్నారి ఖుర్షిద్‌ను సోమవారం తెల్లవారుజామున గొంతు నులిమి హత్య చేసింది. కాగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని స్థానికులు అంటున్నారు.