
భర్తపై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు:అరెస్ట్
పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, భర్త శివల మధ్య గతంలో చోటు చేసుకున్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.
విశాఖ:పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, భర్త శివల మధ్య గతంలో చోటు చేసుకున్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తాను ఇంట్లోలేని సమయంలో భర్త శివ కొన్ని విలువైన డాక్యుమెంట్లను తీసుకువెళ్లాడంటూ ఎమ్మెల్యే అనిత విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త శివను అరెస్ట్ చేశారు.
ఇప్పటికే వారిద్దరి మధ్య చోటు చేసుకున్న విభేదాలతో నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే తమను భయపెడుతూ.. తాను ఇంట్లో లేని సమయంలో కొన్ని విలువైన డాక్యుమెంట్లను తీసుకువెళ్లాడంటూ ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. తమది ప్రేమ వివాహమేనని.. ప్రేమించి వివాహం చేసుకున్నంత మాత్రాన భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదని ఏమైనా ఉందా?అని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే పలుసార్లు తమను భయపెట్టి పిల్లల్ని తీసుకువెళ్లడానికి భర్త ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు.