జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ రాజేశ్ తివారీ హాజరుకానున్నట్లు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
-
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హరితహారం
-
హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి
ఎంజీఎం : జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ రాజేశ్ తివారీ హాజరుకానున్నట్లు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాల, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, ఎంజీఎం ఆస్పత్రి, రోహిణి నర్సింగ్ కళాశాల, జయ నర్సింగ్ కళాశాల, గోపాలపురం ఆయుర్వేద కళాశాలల్లో 5 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అలాగే కాళోజీ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆయుర్వేదిక్ కళాశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.