మహబూబ్‌నగర్ విద్యావిభాగం: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్–2016 పరీక్ష నవంబర్ 6న 8వ తరగతి విద్యార్థులకు రెవెన్యూ డివిజన్‌లలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష అప్లికేషన్ ఫారాలు, నామినల్ రోల్స్, ప్రధానోపాధ్యాయులకు సూచనలు www.bsetelangana.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.
నవంబర్ 6న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష
Sep 1 2016 1:35 AM | Updated on Jul 6 2019 1:10 PM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్–2016 పరీక్ష నవంబర్ 6న 8వ తరగతి విద్యార్థులకు రెవెన్యూ డివిజన్‌లలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష అప్లికేషన్ ఫారాలు, నామినల్ రోల్స్, ప్రధానోపాధ్యాయులకు సూచనలు www.bsetelangana.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఓబీసీ, బీసీ విద్యార్థులు 55శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 50శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, మోడల్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50లక్షల కంటే తక్కువగా కలిగి ఉండాలని, ఇటీవల తీసిన ఒరిజినల్ ఆదాయ సర్టిఫికెట్, 7వ తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డులను తప్పనిసరిగా జతపర్చాలని తెలిపారు. ఆధార్ నెంబర్ వేయకపోతే వాటిని స్వీకరించబడవని పేర్కొన్నారు. ఓబీసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు రూ.50 ఈ నెల 5, 6 తేదీల్లో ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ బ్యాంకుల్లో డీడీ తీయాలని కోరారు. పూర్తి చేసిన ఫారాలను మూడు సెట్లు నామినల్ రోల్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లు ఈనెల 7వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాది కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
Advertisement
Advertisement