నిరుద్యోగుల కోసం మెగాజాబ్‌ మేళా | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల కోసం మెగాజాబ్‌ మేళా

Published Tue, Aug 9 2016 8:41 PM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

  • నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుములమదన్‌రెడ్డి
  • అజయ్‌యాదవ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • నర్సాపూర్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్‌మేళాలు చేపడుతున్నట్టు నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం కృష్ణవేణి స్కూల్‌లో అజయ్‌యాదవ్‌  ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు.

    ఉద్యోగం పొందినవారు రాణించాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో పోటీ పెరిందని, అందుకు అనుగుణంగా ప్రతిభను పెంచుకోవాలని సూచించారు. కాగా, జాబ్‌మేళాలో 14 కంపెనీలు పాల్గొనడం అభినందనీయమన్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, అజయ్‌యాదవ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మురళీధర్‌ యాదవ్‌ మాట్లాడుతూ యువతకు అన్ని రంగాల్లో సహకరించేందుకు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గ్రూపు-2 అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చినట్టు గుర్తుచేశారు.

    సర్పంచ్‌ రమణరావు మాట్లాడుతూ.. జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరబిందో ప్రతినిధి రవి మాట్లాడుతూ.. ఉద్యోగాలు రానివారు నిరాశ పడొద్దని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్యక్షుడు గందం రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శశిధర్‌, నాయకులు భోగ శేఖర్‌, మల్లేశ్‌యాదవ్‌, నర్సింగ్‌రావు, సుభాష్‌ గౌడ్‌, భిక్షపతి తదితరులున్నారు.  

    జాబ్‌మేళాలో పాల్గొన్న కంపెనీలు
    ఎంఆర్‌ఎఫ్‌, పెన్నార్‌ స్టీల్స్‌, అరబిందో ఫార్మా కంపెనీ, కోవాలెంట్‌ ల్యాబొరేటరీ, పిరమిల్‌ హెల్త్‌కేర్‌, కిర్బి, తోసిబా, పైనార్‌ ఎలక్ట్రానిక్స్‌, వసుధ ఫార్మా కంపెనీ, హెచ్‌జీఎస్ కంపెనీ, జెన్‌పాక్ట్‌, ఇన్నోవ్‌ సోర్స్‌ ప్రైవేటు కంపెనీ, స్మార్ట్‌ డ్రైవ్‌ సిస్టం కంపెనీ, గ్లాండ్‌ ఫార్మా కంపెనీ, శ్రీరాం చిట్స్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

    జాబ్‌ మేళాకు మంచి స్పందన
    మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుంచి నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 2,050 హాజరయ్యారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల బయోడేటాలు పరిశీలించి త్వరలో సమాచారం అందిస్తామని చెప్పారు.

    విజయవంతంగా కొనసాగిస్తున్నాం
    నిరుద్యోగులకు సహకరించాలన్న లక్ష్యయంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పేదలకు రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అందిస్తున్నాం. ఇటీవల గ్రూపు-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చాం. మరోసారి మరిన్ని ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా జాబ్‌ మేళా చేపడతాం. - మురళీధర్‌యాదవ్‌, అజయ్‌యాదవ్‌ ట్రస్టు చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

    జాబ్‌మేళా బాగుంది
    జాబ్‌మేళా బాగుంది. నన్ను ఎమ్మారెఫ్‌ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వూ ‍్య చేశారు. మరిన్ని జాబ్‌మేళాలు కండక్ట్‌ చేస్తే నాలాంటి నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. - నవీన్‌, బీటెక్‌, నర్సాపూర్‌

    ఉపయోగకరంగా ఉంది
    ఈ జాబ్‌మేళా నిరుద్యోగులకు ఉనయోగకరంగా ఉంది. నేను బీటెక్‌ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. మేళాతో ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా. జిల్లా నుంచి చాలా మంది వచ్చారు. - సౌమ్య, బీటెక్‌, నర్సాపూర్‌

    మరిన్ని కంపెనీలు రావాలి
    మరిన్ని కంపెనీలు వస్తే బాగుండేది. విద్యార్హతలకు ప్రాదాన్యం ఉండేలా కంపెనీలు రావాలి. జాబ్‌ మేళా చేపట్టడం అభినందనీయం. నాలాంటి వాళ్లకు ఉద్యోగ సమస్య తీరుతుంది. - ఈశ్వర్‌, ఐటీఐ, సంగారెడ్డి

    అందరికి ఉపయోగ పడేవిదంగా ఉండాలి
    అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారికి ఉపయోగపడేలా ఉంటే బాగుండేది. ఎక్కువ కంపెనీలు ఐటీఐ అభ్యర్థులను అడిగారు. జాబ్‌మేలా చేపట్టడం అభినందనీయం. - లోకేందర్‌, మెదక్‌

Advertisement
 
Advertisement
 
Advertisement