ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న జిల్లాకు రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న జిల్లాకు రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏపీఎంఐపీ కార్యాలయంలో ఆ శాఖ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీ–1 సీహెచ్ శివసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
6వ తేదీ మధ్యాహ్నం బుక్కరాయసముద్రం మండల శివారు ప్రాంతంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్– ఎఫ్‌పీవో) సదస్సు నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.