ఆకివీడు : ఆకివీడులోని పాత ఆస్పత్రి భవనంలో ఉన్న బి.లక్ష్మి మీసేవా కేంద్రం అనుమతిని రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్ టి.కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేసినట్టు తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి చెప్పారు.
మీసేవా కేంద్రం అనుమతి రద్దు
Aug 5 2016 1:46 AM | Updated on Sep 4 2017 7:50 AM
ఆకివీడు : ఆకివీడులోని పాత ఆస్పత్రి భవనంలో ఉన్న బి.లక్ష్మి మీసేవా కేంద్రం అనుమతిని రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్ టి.కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేసినట్టు తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి చెప్పారు. నిర్వాహకురాలికి రూ. 50 వేలు జరిమానా విధించినట్టు వెల్లడించారు. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఈ కేంద్రంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టగా అవి నిజమేనని తేలిందని, అందుకే జాయింట్ కలెక్టర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారని తహసీల్దార్ వెల్లడించారు.
Advertisement
Advertisement