నేటి నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర | Medak district from today's trip to visit Sharmila | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Jan 3 2016 8:13 AM | Updated on Sep 3 2017 2:58 PM

నేటి నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

నేటి నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మెతుకుసీమలో పరామర్శకు పయనమవుతున్నారు.

తొలిరోజు ఏడు కుటుంబాలకు పరామర్శ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మెతుకుసీమలో పరామర్శకు పయనమవుతున్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు. 
 
 జిల్లా వ్యాప్తంగా 850 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తారు. తొలి రోజు ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు.  మొత్తంగా 13 బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. ఒక్క పటాన్‌చెరు నియోజకవర్గం మినహాయించి మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ షర్మిల పర్యటన ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement