కళానికేతన్‌ ఎండీ కస్టడీకి మరోసారి పిటిషన్‌ ? | MD Kalaniketan custody petition once again? | Sakshi
Sakshi News home page

కళానికేతన్‌ ఎండీ కస్టడీకి మరోసారి పిటిషన్‌ ?

Jul 19 2016 10:11 PM | Updated on Sep 4 2017 5:19 AM

కళానికేతన్‌ ఎండీ లీలాకుమార్‌ను మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పట్టణ పోలీసులు రెండోసారి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

ధర్మవరం అర్బన్‌ :కళానికేతన్‌ ఎండీ లీలాకుమార్‌ను మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పట్టణ పోలీసులు రెండోసారి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఒకసారి పోలీస్‌ కస్టడీకి ఇచ్చిన కోర్టు రెండోసారి ఇచ్చేందుకు అంగీకరించలేదు. పట్టణ పోలీసులు కోర్టులో తమ వాదనలు వినిపించారు.  పోలీసులు మరోసారి ఎండీ లీలాకుమర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఎండీ లీలాకుమార్‌తోపాటు ఆయన భార్య, సంస్థ డైరెక్టర్‌ అయిన లక్ష్మీశారద కూడా పట్టుచీరల వ్యాపారులకు డబ్బు ఎగవేత కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భార్య లక్ష్మీశారదకు 14 కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. ఇంకా రెండు కేసుల్లో బెయిల్‌ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎండీ లీలాకుమార్‌ను పోలీస్‌ కస్టడీకి తీసుకునేందుకు పట్టణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి కస్టడీకి అప్పగిస్తే కేసులోని కీలక సమాచారాలను సేకరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కొనుగోలు చేసిన పట్టుచీరలు ఎక్కడున్నాయి, లీలాకుమార్‌కు ఏఏ బ్యాంకుల్లో ఎంత డబ్బు డిపాజిట్‌ ఉంది..తదితర వివరాలతోపాటు బాధితుల నుంచి కొనుగోలు చేసిన పట్టుచీరలు రికవరీ చేసేందుకు పోలీసులు చూస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement