బంగారం మెరుగుపెడతామని ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన సంఘటన గాజువాక మండలం అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బంగారం మెరుగుపెడతామని ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన సంఘటన గాజువాక మండలం అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మదీన చిన్నతల్లి, మదీన వెంకటలక్ష్మి అత్తా కోడళ్లు. బంగారం మెరుగుపెడతామని ఓ వ్యక్తి వాళ్ల ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న పాత రాగి వస్తువులు ఇవ్వగా వాటిని తళాతళా మెరిసేవిధంగా చేశాడు. దీంతో వారు బంగారు ఆభర ణాలు కూడా ఇచ్చారు. ఇంటి వెనకాలకు వెళ్లి వచ్చేసరికి సదరు వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పరారయ్యారు. వారి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.