దారి’తప్పి శవమయ్యాడు! | man murdered in prakasam district | Sakshi
Sakshi News home page

దారి’తప్పి శవమయ్యాడు!

Nov 25 2016 3:34 AM | Updated on Aug 17 2018 5:11 PM

దారి’తప్పి శవమయ్యాడు! - Sakshi

దారి’తప్పి శవమయ్యాడు!

కట్టుకున్న భార్య ఉన్నప్పటికీ ప్రియురాలి మోజులో పడిన ఆటోడ్రైవర్ ఆమె ఇంటివద్దే శవమై కనిపించాడు.

ప్రియురాలి చేతిలో ఆటో డ్రైవర్ హతం?  
ఇద్దరి మధ్య చాలాకాలంగా వివాహేతర సంబంధం
తన భర్తను ఆమే చంపిందంటూ భార్య ఫిర్యాదు   

ఒంగోలు క్రైం: కట్టుకున్న భార్య ఉన్నప్పటికీ ప్రియురాలి మోజులో పడిన ఆటోడ్రైవర్ ఆమె ఇంటివద్దే శవమై కనిపించాడు. ఒంగోలు నగరంలోని విజయనగర్ కాలనీలో గురువారం ఈ ఉదంతం వెలుగుచూసింది. స్థానిక కమ్మపాలెం మహంకాళి గుడి వద్ద నివాసం ఉంటున్న ఇందుర్తి వెంకటేశ్వర్లు(48) విజయనగర్ కాలనీలో హత్యకు గురయ్యాడు. విజయనగర్ కాలనీలోని ఏడో అడ్డరోడ్డులో నివాసం ఉంటున్న చర్లపల్లి ధనలక్ష్మితో వెంకటేశ్వర్లుకు వివాహేతర సంబంధం ఉంది. చీమకుర్తికి చెందిన ధనలక్ష్మి కొన్నేళ్ల క్రితం నుంచి ఇక్కడే నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్న అతనికి ధనలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఇదే విషయంలో గతంలో ధనలక్ష్మికి వెంకటేశ్వర్లు కుటుంబానికి వివాదాలు జరిగారుు.

దీంతో అతను కొన్నేళ్లుగా తన ప్రియురాలికి  వద్దకు రావటం లేదు. కానీ ఈ మధ్య తిరిగి ఆమెకు దగ్గరయ్యాడు. ఇలా గురువారం ఉదయం వెంకటేశ్వర్లు తన ప్రియురాలిని కలవడానికి వెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో అతని తల వెనుక వైపు బలమైన గాయం కావటంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే చనిపోయాడు.సమాచారం తెలుసుకున్న ఒంగోలు వన్‌టౌన్ సీఐ ఎండ్లూరి రామారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ధనలక్ష్మిని విచారించారు. కింద పడటం వల్ల తలకు గాయమై చనిపోయాడని సమాధానం ఇచ్చింది. వెంకటేశ్వర్లు భార్య ఇందుర్తి సంఘటనా స్థలానికి   చేరుకుని.. ధనలక్ష్మి హత్యచేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement